calender_icon.png 24 September, 2024 | 9:50 AM

కొండ చిలువకు చిక్కినా బతికింది

21-09-2024 02:41:37 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: కొండచిలువ పట్టు ఎలా ఉంటుందో చెప్పనసరం లేదు. దానికి చిక్కిన ఏ జీవి అయినా ప్రాణాలు విడువాల్సిందే. కానీ, థాయ్‌లాండ్‌లో ఓ మహిళ కొండ చిలువకు చిక్కి కూడా ప్రాణాలతో బయటపడింది. అది కూడా రెండుగ ంటలపాటు దాని పట్టులో ఉండి కూడా ప్రాణాలు కాపాడుకొన్నది. బ్యాంకాక్‌లోని తన ఇంటి ముందు అరోమ్ అనే మహిళ గత మంగళవారం అంట్లు తోముతుండగా 16 అడుగుల కొండచిలువ ఒక్కసారిగా ఆమెను చుట్టేసింది. దాని నుంచి తప్పించుకొనేందుకు ఆ మహిళ శతవిధాలా ప్రయత్ని ంచింది.

ఈ పోరాటం దాదాపు 2 గంటలపాటు సాగింది. ‘నేను కొండచిలువ తల పట్టుకొని లాగేందుకు ప్రయత్నిస్తున్నాకొద్ది అది మరింత గట్టిగా నన్ను చుట్టుకొన్నది’ అని ఆ మహిళ తెలిపారు. ఆమె చాలాసేపు కేకలు వేసినప్పటికీ ఎవరూ రాలేదు. గంట న్నర తర్వాత పొరుగింటి మహిళ కేకలు విని పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు అతి కష్టంమీద మహిళను కొండ చిలువ పట్టు నుంచి విడిపించారు.