calender_icon.png 22 February, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూటు మార్చిన కోనప్ప?

22-02-2025 12:00:00 AM

  1. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన కోనేరు?
  2. స్వతంత్రంగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటన 
  3. అసమ్మతి నేత ప్రసన్న హరికృష్ణకు మద్దతు  

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 21 (విజయ క్రాంతి): సిర్పూర్ నియోజకవర్గం లో రాజకీయం రసవత్తరంగా మారుతుంది.  బిఎస్పి నుండి పోటీ చేసి ఓటమి చెందిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్‌ఎస్ లోకి చేరడంతో తన ఓటమికి కారణమైన వారిని పార్టీలోకి తీసుకున్నారని అలక చెందిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన తర్వాత ఉమ్మడి అదిలాబాద్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దండే విఠల్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో వర్గ పోరు మొదలైంది. నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న రావి శ్రీనివాస్ దండే విఠల్ మధ్య విభేదాలు వచ్చాయి. నియోజకవర్గంలో ఒకరిపై ఒకరు వారి అనుచర గణం బహిరంగానే విమర్శలు గుప్పించడంతో కోనేరు కోనప్ప గత కొంతకాలంగా మౌనం పాటించా రు.

రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న కోనేరు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై విముకంగా ఉన్నారు. తాను గతంలో తీసుకువచ్చిన పనుల సైతం రద్దు చేస్తుండడంతో ఆయన కోపానికి ఆజ్యం పోసినట్లు అయింది. దీంతో ఇటీవల కౌటా ల మండల కేంద్రంలో తన అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటిం చడం రాజకీయంగా ప్రకంపనలు రేపింది.

తాను అభివృద్ధి పనులు మంజూరు చేస్తే రద్దు చేసిన విషయాన్ని మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. గురువారం కాగజ్ నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్‌లో పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సీతక్క హాజరైన సమావేశానికి సైతం కోనేరు గైరాజరు అయ్యారు.

కాంగ్రెస్ అసమతి నాయకుడు ప్రసన్న హరికృష్ణ ఎమ్మెల్సీగా పోటీ చేస్తుండడంతో ఆయనకు మద్దతు పలుకుతూ శుక్రవారం పెంచికల్‌పేట్ మండలంలో యువ కులతో కలిసి ప్రచారం నిర్వహించి ప్రసన్నకుమార్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టభద్రులను కోరారు.

బలమైన నేతగా కోనప్ప..

జిల్లా లోనే రాజకీయ చతిరతుడు, బలమైన నేతగా కోనేరు కోనప్పకు పేరుంది. రాజకీయ పార్టీలలో ఉంటూనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.

నిరుద్యోగ యువతకు కోచిం గ్, ఉచిత భోజనం, ఇంటర్మీయట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంతోపాటు కాగజ్‌నగర్ బస్టాండ్ ఎదుట నిత్యాన్నదానసత్రాన్ని ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు భోజనం ఏర్పాటు చేశారు. ఆయన చేపడుతున్న సేవలు రాష్ర్టస్థాయిలోనే గుర్తింపు పొందాయి. 

కోనప్ప వ్యూహం ఏంటి..?

రాజకీయాల్లో కోనేరు కోనప్ప ఒక బ్రాండ్ గా ఉన్న ఆయన ప్రస్తుతం సిర్పూర్ నియోజకవర్గం లో తను చేస్తున్న ప్రకటనలు అధికార పార్టీకి అంతుచిక్కడం లేదు. ఇంతకాలం మౌనంగా ఉన్న కోనేరు కోనప్ప ఒక్కసారిగా ఓపెన్ ఫైర్ ప్రారంభించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 

బీఎస్పీ పార్టీకి క్యాడర్ లేకున్నప్పటికీ 2014లో పెద్ద ఎత్తున తెలంగాణ గాలి వీచిన బీఎస్పీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది కోనేరు కోనప్ప రాష్ర్ట ప్రజలు ఆయన వైపు చూసేలా చేశారు. తధానంతరం బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లోను భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొం దారు.

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ పోరులో ఆయన ఓటమి చెందారు. ప్రస్తుతం ఆయన పబ్లిక్ సమావేశాలలో చేస్తున్న ప్రసంగాలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఆయన వ్యూహం ఏంటని రాజకీ య పార్టీలకు సైతం అర్థం అవడం లేదు. కోనప్ప చేస్తున్న ప్రసంగాలు హస్తం పార్టీకి గుడ్ బై చెప్పినట్లే...