17-12-2024 12:11:00 AM
సిద్దిపేట డిసెంబర్ 16 (విజయక్రాంతి)/ చేర్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొముర వెల్లి ఆలయ భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న రైల్వే స్టేషన్(హాల్ట్) పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2006-07 అప్పటి కేంద్రమంత్రి కేసీఆర్ మనోహరాబాద్ - కొత్తపల్లి రైల్వే లైన్ మంజూరు చేయించి భూసేకరణకు సర్వే కూడా చేయించారు.
అప్పటి ప్రతిపాదిత స్టేషన్లలో నాచారం, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట మాత్రమే ఉన్నాయి. కొమురవెల్లి అప్పుడు వరంగల్ జిల్లాలో ఉండటం వల్ల రైల్వే స్టేషన్ మంజూరు కాలేదు. తెలంగాణ స్వరాష్ట్రంలో కొమురవెల్లి సిద్దిపేట జిల్లా పరిధిలోకి వచ్చింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైల్వే లైన్ నిర్మా ణానికి అవసరమైన భూసేకరణ పూర్తిచేసి నిర్మాణ పనులు చేపట్టింది, అయితే కొమురవెల్లికి రైల్వే స్టేషన్ లేకపోవడంతో స్థానికు లు, మల్లన్న భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఇబ్బందులు పడేవారు.
ఈ విష యమై కొమురవెల్లి ఆలయ కమిటీ, అర్చకులు, స్థానిక, జిల్లా బీజేపీ నాయకులు కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ అత్యవసరమని అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్‌తోపాటు నాటి గవర్నర్ తమిళసైకి విన్నవించారు.
స్పందించిన గవర్నర్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైల్వే స్టేసన్‌ను మంజూరు చేయించారు. 2024, ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి పలువురు ప్రముఖుల చేత శంకుస్థాపన చేశారు.
కిషన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి..
అప్పటి నుంచి కేంద్ర మంత్రి కిషన్‌డ్డి కొమురవెల్లి స్టేసన్ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై వాకబ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్లాట్ ఫాం, సర్వీస్ రోడ్డు, ప్రయాణికుల వెయిటింగ్ హాల్ మొత్తంగా 80శాతం స్టేసన్ నిర్మాణ పనులు పూర్తి అయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. జనవరిలో ప్రారంభిం చేలా సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కొమురవెల్ల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే మల్లన్న క్షేత్రానికి తెలంగా ణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తుల సంఖ్య పెరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. హైదరాబాద్ నుంచి నిరంతరంగా వచ్చె భక్తులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యవంతంగా ఉండనుంది. హైదరాబాద్ నుంచి సిద్దిపేట వరకు మాత్రమే ఇప్పటివరకు రైలు సేవలు కొనసాగుతున్నాయి.
సిద్దిపేట నుంచి వేములవాడ వరకు రైల్వేలైన్ నిర్మాణం పూర్తయితే కొమురవెల్ల్లి, వేములవాడ క్షేత్రాలకు వచ్చే భక్తులకు మరింత రవాణా సౌలభ్యం కలుగుతుంది. ఇటీవలే కొమురవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో.. సిద్దిపేట జిల్లా బీజేపీ నాయకులతో పనుల విషయమై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చర్చించినట్లు తెలిసింది. జనవరిలో వినియోగంలోకి వచ్చేలా పను లు వేగవంతం చేయాలని కిషన్‌రెడ్డి ఆదేశించారు.