calender_icon.png 19 January, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర ప్రారంభం

19-01-2025 02:19:18 PM

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర(Komuravelli Mallanna Jathara) ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత వచ్చే తొలి ఆదివారం కావడంతో మల్లన్న ఆశీస్సులు పొందేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. జాతర(Komuravelli Jathara) రెండు నెలల పాటు కొనసాగి ఉగాదికి ముందు వచ్చే ఆదివారంతో ముగుస్తుంది. ఆలయంలో ప్రతి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తులు బోనాలు, పట్నం, కల్యాణం నిర్వహిస్తారు. తెలంగాణ నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. కొమురవెల్లి మల్లన్న(Komuravelli Mallanna Jatara 2025భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

కొమురవెల్లి మల్లికార్జున స్వామి చరిత్ర

పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరువచ్చి, కాలక్రమేణా కొమరవెల్లి(komuravelli mallanna history) అయిందని భక్తుల నమ్మకం. పరమ శివుడు ఇక్కడి తన భక్తులను కాపాడటానికి ఆదిరెడ్డి, నిలమ్మ అనే దంపతులకు కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని క్షేత్ర పురాణం చెబుతోంది. తర్వాతకూడా తన భక్తుల రక్షణార్ధం ఇక్కడే కొలువుతీరాడు. భక్తులచేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జునస్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతి రూపమైన లింగ రూపంలోకాక, గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు. దేవేరులు యాదవ కులానికి చెందిన గొల్ల కేతమ్మ, లింగ బలిజకులానికి చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపులా దర్ళనమిస్తారు. మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు 500 సంవత్సరాల క్రితం చెయ్యబడ్డది. కాలక్రమేణా భక్తుల రాక మొదలయ్యి, రాను రాను అధికం కావంటంతో దేవాలయంలో వున్న మండపములు విస్తరించబడ్డాయి. సత్రాలు, నూతన కట్టడాలు నెలకొల్పబడ్డాయి. కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట నుండి సికిందరాబాదుకు వెళ్ళే మార్గంలో సిద్ధిపేటకు 24 కి.మీ. ల దూరంలో ఉంది.