calender_icon.png 26 December, 2024 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమురవెల్లి మల్లన్న కళ్యాణంకు భారీ బందోబస్తు

07-11-2024 03:09:16 PM

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే శ్రీకొమురవెల్లి మల్లన్న కల్యాణ ఉత్సవాలకు పకడ్బందీగా పోలీసు బందోబస్తు నిర్వహిస్తామని జిల్లా పోలీసు కమిషనర్ డాక్టర్.అనురాధ తెలిపారు. కొమురవెల్లి ఆలయం ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్, ఏఈఓ శ్రీనివాస్ సూపరిండెంట్ శ్రీరామ్, రవికుమార్, వీరేశలింగంలు గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ డాక్టర్ బి.అనురాధ, అడిషనల్ డీసీపీ యస్.మల్లారెడ్డిలను కలసి మహాప్రసాదం అందజేశారు. డిసెంబర్ 29 నాడు శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం ప్రారంభం అవుతుందని తెలియజేశారు. ముందస్తుగా తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. టెంపుల్ పరిసర ప్రాంతాలలో పనిచేయని సీసీ కెమెరాలను వెంటనే రిపేర్ చేయించాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే కొమురవెల్లి పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.