calender_icon.png 22 September, 2024 | 4:55 AM

గాంధీభవన్‌కు ‘కొమ్మూరి’ పంచాయితీ

22-09-2024 02:50:58 AM

కార్యకర్తలను వేధిస్తున్నాడని ఫిర్యాదు

డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని డిమాండ్

జనగామ, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నాయకత్వంపై కొన్ని రోజులుగా కార్య కర్తలు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయనను డీసీసీ అధ్యక్ష పదవి ను ంచి తప్పించాలనే డిమాండ్ బాగా వినిపిస్తో ంది. ఈ మధ్య ప్రజాపాలన దినోత్సవంలో కొమ్మూరిని వేదిక పైనుంచి దింపించిన ఘ టనతో జనగామ కాంగ్రెస్‌లో రగడ రచ్చకెక్కి ంది. ఈ తరుణంలో కొమ్మూరి అనుకూల నేతలు, వ్యతిరేక నేతల మధ్య రోజుకో వివా దం నడుస్తోంది.

ఎట్టకేలకు ఈ పంచాయితీ గాంధీ భవన్ మెట్లు ఎక్కింది. జనగామ జిల్లాలోని పలు మండలాలకు చెందిన కార్యకర్తలు శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై ఫిర్యాదు చేశా రు. అసెంబ్లీ ఎన్నికల్లో తన స్వయంకృపారాధంతో ఓడిపోయిన కొమ్మూరి.. తన ఓటమి కి కార్యకర్తలే కారణమంటూ వేధింపులకు గురి చేస్తు న్నాడని ఆరోపించారు. సీనియర్ కార్యకర్తలపై దుర్భాషలాడుతూ నియంతగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ఆయ న నాయకత్వ ంలో జనగామలో కాంగ్రెస్ పా ర్టీ బలహీనపడుతోందని, వెంటనే ఆయన ను డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని కోరారు. లేదంచే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని తీరని నష్టం జరిగే ప్రమాదము ందని చెప్పారు. అనంతరం మంత్రులు పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ని కలిసి కొమ్మూరిని డీసీసీ అధ్యక్ష పదవి ను ంచి తప్పించి అందరినీ కలుపుకునిపోయే స మర్థవంతమైన నాయకుడిని నియమించాలని కోరారు.