జడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత
జగిత్యాల, (విజయక్రాంతి): నీతివంతమైన పాలన చేసి జనం గుండెల్లో గూడు కట్టుకున్న నాయకుడు కొమ్మునేని నారాయణ అని జడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. ఇటీవల మృతి చెందిన జగిత్యాల జిల్లా గోపులాపూర్ మాజీ సర్పంచ్ కొమ్మునేని నారాయణ కుటుంబ సభ్యులను జడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత - సురేష్ పలువురు ప్రముఖులు పరామర్శించి, మాజీ సర్పంచ్ నారాయణ సేవలు చిరస్మ రనీయమైనవని కొనియాడారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. నారాయణ మరణానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. అకాల మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. నారాయణ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మ శాంతి కలగాలన్నారు. న్యాయవాది రాచకొండ శ్రీరాములు, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు వోడ్నాల రాజశేఖర్, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, జగిత్యాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ లైశెట్టి వెంకట్, తరుణ్, బుగ్గారం మాజీ సర్పంచ్ మసర్తి రాజిరెడ్డి, బుగ్గారం మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి దసర్తి పూర్ణ చందర్, బీర్ పూర్ తిరుపతి, మసర్తి బుచ్చన్న, దండికే తిరుపతి తదితరులు పాల్గొన్నారు.