calender_icon.png 19 January, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమ్మెర లక్ష్మణ్ అవినీతి చిట్టా విప్పితే జైలుకు వెళ్లడం ఖాయం

19-01-2025 06:31:00 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండల బీఆర్ఎస్ నాయకుడు కొమ్మెర లక్ష్మణ్ అవినీతి చిట్టా విప్పితే జైలుకు వెళ్లడం ఖాయమని బెల్లంపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యులు కారుకూరి రాoచందర్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట చెట్లను తొలగించారని కొమ్మెర లక్ష్మణ్ అటవీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అతని చర్యలపై రామ్ చందర్ ఎంపీడీవో కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. నాయకుడు కొమ్మెర లక్ష్మణ్ పోకడ మార్చుకొని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు, అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. బెల్లంపల్లి హెడ్ క్వార్టర్ ముందు సింగరేణి యాజమాన్యం సోలార్ పవర్ ప్లాంట్ కోసం చదివిన చేసిన స్థలం లీజు పీరియడ్ ముగియడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కోరినట్లు చెప్పారు. ఈ స్థలంలో గీత కార్మికుల ఉపాధికి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఈ స్థలం విషయంలో కొమ్మెర లక్ష్మణ్ నీతి తప్పి మాట్లాడుతున్నారని అన్నారు. ఎంపీడీవో కార్యాలయం పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరిగి పాములు సంచరిస్తున్నాయని, అధికారుల అంగీకారంతో పిచ్చి మొక్కలు తొలగిస్తే కాంగ్రెస్ నాయకులు, అధికారులపై అటవీ అధికారులకు ఫిర్యాదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలను పాములు కుడితే లక్ష్మణ్ బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. తనపై జడ్పిటిసి గా పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మణ్ రాజకీయాల్లో పూటకు నాయకుని దగ్గర పబ్బం గడుపుతూ చిల్లర ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసే స్థాయి కొమ్మెర లక్ష్మణ్ కు లేదన్నారు. కొమ్మెర లక్ష్మణ్ అవినీతి చిట్టా అంతా తన వద్ద ఉందని, అది బయటకు తీస్తే లక్ష్మణ్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బత్తుల రవి, సింగతి సత్యనారాయణ, ముత్తె భీమన్న,డోలె సురేష్ తదితరులు పాల్గొన్నారు.