calender_icon.png 24 September, 2024 | 5:51 AM

మెగాస్టార్‌కు కోమటిరెడ్డి అభినందన

24-09-2024 12:46:06 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్స్‌లో చోటు దక్కడంపై రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం చిరంజీవిని అభినందించారు. తన నటనతో రెండు తెలుగు రాష్ట్రా ల్లోనే కాక..ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారని కొనియాడారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24వేల స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించినందుకు చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు.