calender_icon.png 5 January, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఆర్‌ఆర్‌పై కోమటిరెడ్డి దుష్ప్రచారం

31-12-2024 02:50:18 AM

మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని మాజీ మంత్రి వేముల ప్రశాం త్‌రెడ్డి హెచ్చరించారు. ఏడాది నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు అబద్ధాలు చెప్పడంలో ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.

సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. మంత్రివ ర్గం చెప్పే అబద్ధాలను చూసి అబద్ధమే సిగ్గుపడుతోందని, కేసీఆర్ చేసిన పనులు తామే చేసినట్టుగా గొప్పలు చెప్తున్న మంత్రుల తీరు.. మందికి పుట్టిన బిడ్డను బిడ్డగా భావిస్తున్నారని పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు ఆలోచన కేసీఆర్ మదిలో పుట్టిందని, ఇది కేసీఆర్ మానస పుత్రిక అని చెప్పారు.

ఎం తో మంది ఇంజినీర్లు, మేధావులు, ఉన్నతాధికారులతో మేదోమధనం చేసిన రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీగా అబివృద్ధి చేయడానికి వంద కిలోమీటర్ల రేడియస్‌లో రీజినల్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయాలనుకున్నామన్నారు.