హైదరాబాద్ మణికొండలోని ఓయూ కాలనీలో రమేష్ స్టూడియోస్‌ను ప్రారంభించారు. సోమవారం సంపూర్ణ సూపర్ మార్కెట్ పైన రమేష్ స్టూడియోస్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై స్టూడియోతో పాటు డీఐ సూట్ ఓపెన్ చేశా రు.
తెలుగు చిత్ర నిర్మాత మండలి ప్రెసిడెంట్, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ డబ్బింగ్ థియేటర్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎడిటింగ్ రూమ్‌ను ఓపెన్ చేశారు. అదేవిధంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి రెండవ సెకండ్ సూట్ ఓపెన్ చేశారు.