మాజీ సీఎం షిండేతో వెంకట్‌రెడ్డి భేటీ
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాం తి): మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియాకూటమి బంపర్ మెజార్టీతో గెలిచి అధికారం చేపట్టబోతున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ర్ట పీసీసీ, షోలాపూర్ ఎంపీ ప్రణితి షిండేతో కలిసి వెంకట్‌రెడ్డి శుక్రవారం షోలాపూర్‌లో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఆదరణ బాగుందని, ఎక్కడికెళ్లినా కాంగ్రెస్సే కావాలని ప్రజలు ఎదురేగి స్వాగతం పలుకుతు న్నారని తెలిపారు.
తెలంగాణ పథకాలు మహారాష్ర్టలోనూ అమలు కావాలంటే కాంగ్రెస్ రావాలని పేర్కొన్నారు. తెలంగాణతో షోలాపూర్‌కు విడదీయలేని బంధం ఉందని, అత్యధిక ప్రజలు తెలంగాణకు చెందినవారేనని చెప్పా రు. ప్రచారం అనంతరం మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్షిండేతో కోమటిరెడ్డి భేటీ అయ్యా రు. తన ప్రచార అనుభవాలను షిండేతో పంచుకున్నారు.