calender_icon.png 19 March, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లెందు రెవెన్యూ డివిజన్‌తోపాటు కొమరారం, బోడు మండలాలను ఏర్పాటు చేయాలి

19-03-2025 01:45:22 AM

అఖిల పక్షం నాయకులతో వెళ్లి సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య 

ఇల్లెందు, మార్చి 18(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలోని  సీఎం చాంబర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మంగళవారం అఖిలపక్షం నాయకులతో వెళ్లి కలిశారు. అనంతరం ముఖ్యమంత్రికి చరిత్ర కలిగిన ఇల్లందును, రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని, ఇల్లందు నుంచి వేరుగా కొమరారం, టేకులపల్లి నుంచి వేరుగా బోడు నూతన మండలాలుగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

సీతారామ ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో గోదావరి జలాలను ఇల్లందు నియోజకవర్గంతో పాటు, మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గాలకు రాకుండా చేస్తున్నారన్నారని తెలిపారు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కూడా ఈ నియోజకవర్గాలకి నీళ్లు వచ్చే అవకాశము లేదన్నారు. ఈ నియోజకవర్గాలకు గోదావరి జలాలను అందించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయారు.

ముఖ్యమంత్రి స్పందిస్తూ, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, అఖిలపక్షం ఏర్పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలను, అధికారులను పిలిపించి మాట్లాడాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మహబూబాబాద్, డోర్నకల్, వైరా ఎమ్మెల్యేలతో పాటు, ఈ కార్యక్రమంలో ఇల్లందు అఖిలపక్ష నాయకులు దేవరకొండ శంకర్, ఆలేటి కిరణ్, గౌని నాగేశ్వరరావు, ముద్రగడ వంశీ, గోపగాని శంకర్రావు, షేక్ యాకుబ్ షావలి, బండారు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు