calender_icon.png 6 October, 2024 | 7:48 PM

తెలంగాణ ఉద్యమం ఆయువుపట్టు.. ప్రభుత్వ ఉద్యోగాలు

06-10-2024 05:44:09 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): శిల్పకళా వేదికలో 'కొలువుల పండగ' కార్యక్రమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించారు.  ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన ఏఈఈఈ, ఏపీ, పీఈడీ, లైబ్రేరియన్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లకు నియామకపత్రాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పొంగులేటి శ్రీనివాసు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఉద్యోగానికి ఎంపికైన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం ఆయువుపట్టు.. ప్రభుత్వ ఉద్యోగాలు అని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని సంవత్సరాల కొద్దీ సాగదీసింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిక వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నోటిఫికేషన్ల దశలోనే కొన్ని సంవత్సరాల పాటు ఉంచారని, పరీక్ష పూర్తి చేసి కూడా ఐదారేళ్లు గడిచిన నియామక పత్రాలు ఇవ్వలేదని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంలోని వారి ఉద్యోగాలు పోతేనే పేదలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. తను చెప్పినట్లుగానే కేసీఆర్ కు ఉద్యోగం పోయింది.. ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు.

ఈ ప్రబుత్వం ఏర్పాడిన 90 రోజుల్లో 31 వేల మందికి నియామక పత్రాలు ఇచ్చామని, అభ్యర్థులకు జీవితాంతం గుర్తుండేలా కుటుంబసభ్యుల సమక్షంలో నియామకపత్రాలు ఇస్తున్నామని చెప్పారు. అభ్యర్థులు దసరాను సంతోషంగా జరుపుకోవాలని పండగకు ముందే నియామక పత్రాలు అందిస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తేనే.. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు పోరాడితేనే తెలంగాణ వచ్చిందన్నారు. ఉద్యోగం అంటే.. బాధ్యత మాత్రమే కాదు... ఒక ఉద్వేగం అని, తెలంగాణ పునఃనిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచారు.