26-03-2025 12:07:12 AM
ప్రముఖ కోలీవుడ్ నటుడు, కరాటే మాస్టర్ షిహాన్ హుసైనీ (60) కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తనకు బ్లాక్‌బెల్ట్‌లో శిక్షణ ఇచ్చిన గురువు షిహాన్ హుసైనీ మరణ వార్త తనను ఎంతో బాధించిందని ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌కల్యాణ్ అన్నారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో షిహాన్ ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. “షిహాన్ కఠినమైన నిబంధనలతో నాకు కరాటే నేర్పారు. మొదట ‘ప్రస్తుతం శిక్షణ ఇవ్వడంలేదు.. కుదరదు’ అన్నారు. ఎంతో బతిమాలితే అంగీకరించారు. ‘తమ్ముడు’ సినిమాలో సన్నివేశాలకు ఆ శిక్షణే ఉపయోగపడింది. మరణాంతరం తన దేహాన్ని మెడికల్ కాలేజీకి అందజేయాలని ప్రకటించడం ఆయన గొప్ప ఆలోచనా విధానానికి నిదర్శనం” అని పవన్ పేర్కొన్నారు.