calender_icon.png 18 January, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోహినూర్ నుంచి కొల్లగొట్టుడే!

08-07-2024 12:23:41 AM

ఇప్పటి వరకు అనేక విగ్రహాలు, విలువైన వస్తువులు చోరీ

అదే కీర్తితో వెలుగొందుతున్న ఇండియా

న్యూఢిల్లీ, జూలై 7: ఎన్నో తరాల నుంచి ఇండియాకు చెందిన అమూల్య సంపదను అనేక జాతుల వారు చోరీ చేస్తూనే ఉన్నారు. అయినా ఇండియా మాత్రం అదే కీర్తితో వెలుగొందుతోంది. ఒకప్పుడు బ్రిటీష్ వారు మన విలువైన సంపదను దోచుకెళ్లగా.. ఈ కాల ంలో అనేక మంది స్మగ్లర్స్ ఈ చోరీలకు దిగుతున్నారు. సుభాష్ కపూర్ అనే వ్యక్తి విగ్రహాల స్మగ్లర్. ఇతడు ఇండియా నుంచి అక్రమంగా తరలించిన విగ్రహాలు అనేకం. కానీ సుభాష్  పాపం పండి... అతడు ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. అతడు మాయం చేసిన రెండు విగ్రహాలు మాత్రం ఇంకా దొరకలేదు. 

విజయ్ కుమార్ ‘ఇండియా ప్రైడ్’ ప్రాజెక్టులో 2013లో నెలకొల్పి 2021లో ఇండి యాకు తిరిగివచ్చాడు. ఇండియా నుంచి దొం గిలించిన 600 విగ్రహాలను వెనక్కు తీసుకువచ్చేందుకు సహాయం చేశాడు. ఎన్నో ఏళ్లుగా ఇండియా కళాఖండాల దోపిడీ జరుగుతోంది. ఇలా ఎంతో మంది హీరోలు ఇండియా సంపదను తిరిగి తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాకు  సాయపడుతున్నారు. బ్రిటీష్ కాలంలోనే ఈ లూటీలు జ రిగాయని అనుకుంటే పొరపాటే అవుతుంది. బ్రిటీష్ కాలంలోనే కాకుండా మన పాలనలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

వాళ్లకి రాయేనేమో.. మనకు దేవుళ్లు.. 

ఇలా ఇండియా నుంచి చోరీకి గురయిన అనేక విగ్రహాలు పాశ్చాత దేశాల మ్యూజియాల్లో ప్రదర్శించబడుతున్నాయి. అక్కడి వారు వాటిని కేవలం రాయి మీద చెక్కిన ప్రతిమల్లానే చూస్తారు. కానీ అవి (ఆ రాతి శిల్పాలు) మనకు దేవుళ్లు.. 

ఇండియా నుంచి దోపిడీకి గురయిన  అపురూప ఖండాలు మచ్చుకు కొన్ని 

మనకు స్వతంత్య్రం రాక ముందు నుంచి నేటి వరకు ఇండియాలో ఉన్న అనేక కళాఖండాలు చోరీకి గురవుతూనే ఉన్నాయి. 17 శతాబ్దాల కాలంలో పోర్చుగీసు, బ్రిటీష్, డచ్ వారు ఈ చోరీలకు పాల్పడితే ప్రస్తుతం ఇండియన్ ముఠాలే చోరీ చేయడం గమనార్హం. 

కోహినూర్.. 

కోహినూర్ డైమండ్ ప్రత్యేకత, దాని విలువ అందరికీ తెలుసు. ఇది మాత్రమే కాకుండా అమరావతి మార్బుల్స్, సుల్తాన్ గంజ్ బుద్దా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో భారతీయ కళాఖండాలు చోరీకి గురయ్యాయి. వాటిలో కొన్ని ఇప్పటికి కూడా పాశ్చాత దేశాల్లో ఉన్నాయి. కోహినూర్ డై మండ్ వంటి అరుదైన సంపదను ఇండియాకు తీసుకొచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కుదరడం లేదు. 

అక్కడే ఎక్కువ.. 

ఇండియా నుంచి చోరీకి గురైన వస్తువు లు, కళాఖండాలు ఎక్కువగా బ్రిటీష్ మ్యూజియాల్లోనే ఉన్నాయి. బ్రిటీష్ మ్యూజియాల్లో వేర్వేరు దేశాల నుంచి దోపిడీ చేసిన వస్తువులే ఎక్కువగా కనిపిస్తాయనేది విశ్లేషకుల మాట. 

వాటిని ఎలా వెనక్కు తేవచ్చంటే.. 

మన ప్రభుత్వం తలచుకుంటే చోరీకి గురై వేరే దేశాల్లో ఉన్న కళాఖండాలను వెనక్కుతీసుకురావచ్చు. 1970 యునెస్కో కన్వెన్షన్ ప్రకారం వాటిని వెనక్కు తీసుకురావడం కొద్దిగా కష్టమైన పనే కానీ అసాధ్యమైన పని మాత్రం కాదు. మన ఇండియాకు చెందిన కళాఖండాలు విదేశాల్లో గుర్తించబడితే అర్కియాజిల్ సర్వే ఆఫ్ ఇండియా మన ఇండియన్ కల్చర్ లేదా విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అక్కడి ప్రభుత్వాలను సంప్రదించి వెనక్కు తెచ్చే వీలుంటుంది. 

ఎన్ని కళాఖండాలను వెనక్కు తీసుకొచ్చారంటే.. 

2021లో అమెరికా 248 అపురూప కళాఖండాలను వెనక్కు ఇచ్చేసింది. వాటిల్లో 12వ శతాబ్దానికి చెందిన శివనటరాజ విగ్రహం ఉంది. ఇండియా నుంచి చోరీ అయిన తర్వాత రికవరీ చేయబడిన అతిపెద్ద విగ్రహం ఇదే.