calender_icon.png 15 April, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తేలిపోయినా చెన్నై.. కోల్‌కతా ఘన విజయం

11-04-2025 10:33:37 PM

చెన్నై: ఐపీఎల్ 2025 లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగినా మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)పై కోల్‌కతా నైట్ రైడార్స్(Kolkata Knight Riders) 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినా కోల్‌కతా 10.1 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. కోల్‌కతా బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (23), సునీల్ నరైన్ (44), కెప్టెన్ అజింక్య రహానే (20), రింకు సింగ్(15) పరుగులతో రాణించారు. చెన్నై బౌలర్లలో అనుష్ కాంబొజ్, నూర్ ఆహ్మద్ తలో వికెట్ తీశారు. 

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చినా చెన్నై నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 103 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్ లో తొలిసారి కెప్టెన్ గా వచ్చినా ధోనీ ఒక పరుగు చేసి తన అభిమానులను నిరాశపర్చాడు. విజయ్ శంకర్ (29), శివమ్ దూబె (31) పరుగులు సమర్పించుకున్నారు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 3, వరుణ్ చక్రవర్తి 2, హర్షిత్ రాణా 2, మోయిన్ అలీ, వైభవ్ అరోరా తలో వికెట్ తీసుకున్నారు.