30-04-2024 12:05:00 AM
జైపూర్, కాన్పూర్, గోవా ఎయిర్‌పోర్ట్‌లలో అలర్ట్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: జైపూర్, కాన్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చా యి. గుర్తు తెలియని దుండగులు ఈ విమానాశ్రయాల్లో బాంబులు ఉన్నాయంటూ మెయిల్స్ చేశారు. దీంతో పోలీసు అధికారులు ఆయా విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అలాగే ఎయిర్‌పోర్టుల్లో క్షుణ్నంగా తనిఖీలు చేశారు. అయితే ఎక్కడ కూడా బాంబులు దొరకపో వడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎవరో కావాలనే తప్పుదోవ పట్టించేందుకే ఇలా మెయిల్ పంపారని, వారిని పట్టుకునేందుకు ప్రయ త్నిస్తున్నామని అధికారులు చెప్పా రు. రెండు రోజులు కింద డా ఇలాగే పలు విమానాశ్రయాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. గోవాలోని డబోలిమ్ ఎయిర్‌పోర్టు అధికారిక మెయిల్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఎయిర్‌పోర్టులో పోలీసు లు క్షుణ్నంగా తనిఖీలు చేశారు.