calender_icon.png 15 April, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోల్‌కతా అలవోక విజయం

12-04-2025 12:07:47 AM

చెన్నై జట్టుకు వరుసగా ఐదో పరాజయం

చెన్నై, ఏప్రిల్ 11: ఐపీఎల్ 18వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయా ల పరంపర కొనసాగుతూనే ఉంది. శుక్రవారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికె ట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై అలవోక విజయాన్ని అందుకుంది. తొలు త బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేసింది. శివమ్ దూబే (31 నాటౌట్), విజయ్ శంకర్ (29) పర్వాలేదనిపించారు.

కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 3, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం కోల్‌కతా నైట్‌రైడ ర్స్ 10.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 107 పరుగులు చేసి గెలుపొందింది. సునీల్ నరైన్ (18 బంతు ల్లో 44) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. రహనే (20*), రింకూ సింగ్ (15*) జట్టును గెలిపించారు. అన్షుల్ కంబో జ్, నూర్ అహ్మద్  చెరొక వికెట్ తీశా రు. నేడు జరగనున్న డబుల్ హెడర్ లో భాగంగా తొలి మ్యాచ్‌లో లక్నోతో గుజరాత్, రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తో పంజాబ్ తలపడనున్నాయి.