30-04-2025 01:14:28 AM
14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి
ఢిల్లీ, ఏప్రిల్ 29: ఐపీఎల్ 18వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నా లుగో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.
అనంతరం ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి ఓటమిపాలైంది. డుప్లెసిస్ (62) అర్థసెంచరీ చేయగా.. అక్షర్ (43) పర్వాలేదనిపించాడు. వరుస విరామాల్లో వికెట్లు పడడంతో ఢిల్లీ ఓటమి దిశగా పయనించింది.