RG Kar Rape-Murder Case: కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధీనంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(R G Kar Medical College and Hospital Kolkata)లో డ్యూటీ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్(Sanjay Roy)కు సోమవారం సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. దోషి సంజయ్ కు జీవితఖైదుతో పాటు రూ. 50 వేలు జరిమానా విధించింది. బాధితురాలి కుటుంబానికి రూ. 17 లక్షలు చెల్లంచాలని ప్రభుత్వానికి సీల్దా కోర్టు(Sealdah Court) ఆదేశించింది. పరిహారం తీసుకునేందుకు వైద్యురాలి తల్లిదండ్రులు నిరాకరించారు. పరిహారం కాదు.. న్యాయమే కావాలని వైద్యురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు(BNS Sections) 64,66,103/1 కింద సంజయ్ కు శిక్ష పడింది. 2024 ఆగస్టు 9తేదీన కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి(Junior Doctor in Kolkata)పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ఆగస్టు 10న పోలీసులు నిందితుడైన సంజయ్ రాయ్ ను అరెస్ట్ చేశారు. కోల్‌కతా జూనియర్ డాక్టర్ పై హత్యాచార కేసును సీబీఐ(CBI) విచారించింది. ఈ కేసులో 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను సీబీఐ సేకరించింది. సీబీఐ ఆధారాల మేరకు సంజయ్ రాయ్ ను కోర్టు దోషిగా తేల్చింది. దోషి సంజయ్ కు ఉరిశిక్ష వేయాలని సీబీఐ వాదించింది. అత్యంత అరుదైన కేసులో సీబీఐ వాదించింది. అత్యంత అరుదైన కేసు అన్న వాదనతో సీల్దా కోర్టు విభేధించింది. కోల్‌కతా పోలీస్‌లో మాజీ పౌర వాలంటీర్ అయిన సంజయ్ రాయ్‌ను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కోల్‌కతాలోని కోర్టుకు తరలించారు. అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు, సీల్దా న్యాయమూర్తి అనిర్బన్ దాస్(Sealdah Judge Anirban Das), శిక్ష పరిమాణాన్ని ప్రకటించే ముందు సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు సంజయ్ రాయ్ వాంగ్మూలాన్ని విన్నారు.