calender_icon.png 2 April, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోల్‌కతా సునాయాసంగా..

27-03-2025 12:00:00 AM

  • రాజస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం

డికాక్ మెరుపులు.. బౌలర్ల సమిష్టి ప్రదర్శన

ఉప్పల్ వేదికగా నేడు లక్నోతో హైదరాబాద్ ‘ఢీ’

గౌహతి, మార్చి 26: ఐపీఎల్ 18వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి విజయంతో మెరిసింది. బుధవారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనకు తోడు బ్యాటింగ్‌లో డికాక్ మెరుపులతో కేకేఆర్ సునాయాస విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

ధ్రువ్ జురేల్ (33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జైస్వాల్ (29) పర్వాలేదనిపించాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, హర్షిత్ రానా, మోయిన్ అలీ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 17.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 153 పరుగులు చేసి గెలుపొందింది.

క్వింటన్ డికాక్ (97 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. హసరంగా ఒక వికెట్ పడగొట్టాడు. తొలి విజయంతో జోరు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.