నాగర్‌కర్నూల్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఆర్డీవో పీ నాగరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో అలసత్వం వహిస్తూనే భూసమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చే రైతులు, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. విచారణ అనంతరం మంగళవారం రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఆర్డీవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.