calender_icon.png 13 March, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోలం ఆదివాసీలను విడుదల చేయాలి

13-03-2025 12:46:39 AM

తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఈసం సుధాకర్ డిమాండ్

మహబూబాబాద్. మార్చి12 (విజయక్రాంతి): నిజనిర్ధారణ చేయకుండా అమా యక  కోలం ఆదివాసి ప్రజలను అక్రమంగా అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల  చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఈసం సుధాకర్ డిమాండ్ చేశారు.  బుధవా రం మహబూబాబాద్ జిల్లా గూడూరు మం డలంలోని కొమరం భీం కాలనీ బొల్లి  సార య్య అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో సుధాకర్ మాట్లాడుతూ..

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా  వాంకిడి మండలంలోని రింగారిట్ గ్రామంలో  వారం రోజుల కింద కోవ  జంగు,కోవ రాము అడవి నరికారని నెపంతో అరెస్ట్ చేసిన అమాయక ఆదివాసిలను అటవీశాఖ అధికారులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ  అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. అమాయక ఆదివాసులను టార్గెట్ చేసి,  టైగర్ జోన్ ఓపెన్ క్యాస్టల పేరిట ఆదివాసి గ్రామాలను తరలించే కుట్ర చేస్తున్నారన్నారు.