22-04-2025 04:36:10 PM
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా రెండవ స్థానంలో నిలవడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు(Congress Party District President Kokkirala VishwaPrasad Rao) మంగళవారం ప్రకటనలో తెలిపారు. అత్యంత వెనుకబడిన ఆదివాసి జిల్లాలో విద్యారంగాన్ని ముందుకు తీసుకు వెళుతున్న అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దిన లెక్చరర్లకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలువగా కొమురం భీం జిల్లా రెండవ స్థానంలో నిలవడంతో మంత్రి సీతక్కకు అభినందనలు తెలిపారు.