calender_icon.png 18 November, 2024 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసీస్ మీడియాలో కోహ్లీ మేనియా

13-11-2024 12:00:00 AM

పెర్త్ టెస్టుకు బౌన్సీ పిచ్

పెర్త్: బోర్డర్ ట్రోఫీలో భాగం గా ఈ నెల 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా మీడియా ప్రశంసలతో ముంచెత్తింది. ముఖ్యంగా ‘ది డైలీ టెలిగ్రాఫ్’ పత్రిక కోహ్లీ నిలబడి ఉన్న ఫోటోను ఫ్రంట్ కవర్ పేజీలో ప్రచురించడం విశేషం.  ఏ ఫార్మాట్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడాడు, ఎన్ని పరు గులు, సెంచరీలు చేశాడు, సగటు ఎంత? అనేది వివరాలను వెల్లడించింది. మరో ప్రముఖ పత్రిక ఆడ్వర్టుజర్ ‘ఫైట్ ఫర్ ఏజెస్’ పేరిట ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

గతంలో ఇదే ‘ది డైలీ టెలిగ్రాఫ్’ యువ ఓపెనర్ జైస్వాల్‌ను పొగుడుతూ ‘కొత్త రాజు’ అని శీర్షికను పెట్టింది. గత రెండు పర్యాయాల్లో ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించిన రోహిత్ సేన ఈసారి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తోంది. ఇక తొలి టెస్టు జరగనున్న పెర్త్‌కు పేస్, బౌన్సీ పిచ్‌ను తయారు చేసినట్లు పిచ్ క్యూరేటర్ మెక్ డొనాల్డ్ వెల్లడించారు.

ఇప్పటికే టీమిండియా ఆసీస్ గడ్డపై అడుగుపెట్టింది. వాకా స్టేడియానికి దగ్గర్లోని సెంటర్ వికెట్‌లో భారత్ తమ ప్రాక్టీస్‌ను ఆరంభించింది. భార త ఆటగాళ్లునవంబర్ 15 నుంచి 17 వరకు ఇంట్రా స్కాడ్‌తో మ్యాచ్ ఆడనున్నారు . పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండడంతో భారత్ నలుగురు పేసర్లు, ఒక స్పిన్ కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశముంది.