ఐపీఎల్ 17వ సీజన్లో పరుగుల వరద పారించి.. ఫుల్ ఫామ్‌తో టీ20 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. లయ అందుకోవడంలో విఫలమవుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా తరఫున మూడో స్థానంలో బరిలోకి దిగే విరాట్.. తాజా మెగాటోర్నీలో ఓపెనర్‌గా వచ్చి వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్నాడు. తొలి పోరులో ఐర్లాండ్‌పై ఒక పరుగు మాత్రమే చేసి ఔటైన కోహ్లీ.. పాకిస్థాన్‌పై ఒక్క బౌండ్రీ కొట్టి వెనుదిరిగాడు. ఇక ముచ్చటగా మూడో మ్యాచ్‌లోనైనా రాణిస్తాడేమో అనుకుంటే.. సౌరభ్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో విరాట్‌ను వన్‌డౌన్‌లోనే బ్యాటింగ్‌కు పంపాలనే వాదన మరింత బలంగా వినిపిస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీకి ఇదే తొలి గోల్డెన్ డక్ కాగా.. మొత్తం కెరీర్లో రెండోది.