calender_icon.png 24 February, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాక్టీస్‌లో బిజీబిజీగా కోహ్లీ

28-01-2025 11:30:11 PM

న్యూఢిల్లీ: పుష్కరకాలం తర్వాత రంజీ ట్రోఫీ ఆడనున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు తన ప్రాక్టీస్ షురూ చేశాడు. ఈ నెల 30 నుంచి ఢిల్లీ..  రైల్వేస్‌తో సీజన్‌లో చివరి మ్యాచ్ ఆడనుంది. కాగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో మంగళవారం కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఉదయం 9 గంటలకు తన జెట్ బ్లాక్ బ్యాగ్‌తో మైదానంలో అడుగుపెట్టిన కోహ్లీ ఢిల్లీ జట్టు హెడ్ కోచ్ శరణ్‌దీప్ సింగ్, బ్యాటింగ్ కోచ్ బంటూ సింగ్‌తో ముచ్చటించాడు. అనంతరం 35 నిమిషాల పాటు వార్మప్‌కు సమయం కేటాయించాడు.

ఢిల్లీ కెప్టెన్ ఆయుశ్ బదోని దగ్గరకు వచ్చిన కోహ్లీ.. ‘నువ్వు బ్యాటింగ్ కొనసాగించు.. ఆ తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తా’ అని చెప్పాడు. అనంతరం రెండు గంటల పాటు బ్యాటింగ్, త్రో డౌన్స్‌తో పాటు క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో లెఫ్టార్మ్ స్పిన్నర్లు హర్ష్ త్యాగి, సుమిత్ మాథూర్ బౌలింగ్‌లో బ్యాటింగ్ ఆడాడు. పేసర్లు నవదీప్ సైనీ, మోనీ గ్రేవాల్, రాహుల్ గెహ్లోట్, సిద్ధాంత్ శర్మలు కోహ్లీకి బౌలింగ్ చేశారు. ప్రస్తుతం గ్రూప్ ఉన్న ఢిల్లీ ఆరు మ్యాచ్‌ల్లో ఒక విజయం, రెండు ఓటములు, మూడు డ్రాలతో ఆరో స్థానంలో ఉన్నాడు.