రంజీ ట్రోఫీ
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలో ఆడే అవకాశముంది. రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్రతో జరగనున్న మ్యాచ్‌కు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ 22 మందితో ప్రకటించిన జట్టులో కోహ్లీ, పంత్‌లను ఎంపిక చేసింది. అయితే రాజ్‌కోట్ వేదికగా సౌరాష్ట్రతో జరగనున్న మ్యాచ్‌కు కోహ్లీ దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బోర్డర్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ టెస్టు ముగిసిన అనంతరం కోహ్లీ మెడ నొప్పితో బాధపడుతున్నాడు. మెడ నొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో సౌరాష్ట్రతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని ఇప్పటికే ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌కు కోహ్లీ సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. ఇక కోహ్లీ రంజీల్లో ఢిల్లీ తరఫున చివరిగా 2012లో ఉత్తర్‌ప్రదేశ్‌తో మ్యాచ్‌లో పాల్గొన్నాడు.
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం రంజీ ట్రోఫీ ఆడనున్నాడు. అయితే ఢిల్లీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకునేందుకు తాను సముఖంగా లేనట్లు పంత్ తెలిపాడు. ఆయుశ్ బదోనినే కెప్టెన్‌గా ఉండాలని పంత్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు ఆటగాళ్లంతా దేశవాలీ క్రికెట్‌లో తప్పనిసరిగా ఆడాల్సిందేనంటూ బీసీసీఐ నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ ముంబై తరఫున, శుబ్‌మన్ గిల్ పంజాబ్ తరఫున రంజీల్లో ఆడనున్నారు. ఇక జనవరి 22 నుంచి స్వదేశంలో టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.