నిందితులను పట్టుకున్న పోలీసులు
సిరిసిల్ల, నవంబర్ 11 (విజయక్రాంతి): వేములవాడ ఆలయంలో బ్లాక్‌లో కోడె టికెట్లు అమ్ముతున్న రమేష్, పూరెల శ్రీనివాస్‌లను ఆల య ఎస్పీఎఫ్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. కార్తీక సోమ వారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కోడె టికెట్ల కోసం భక్తులు క్యూ లో నాలుగు నుంచి ఐదు గంటలు వేసి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో భక్తుల అసరాలను ఆసరా చేసుకున్న సిరిసిల్ల జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పూరెల శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా అన్నారం గ్రామానికి చెందిన రమేష్ బ్లాక్‌లో టికెట్లు అమ్ముతుండా పోలీసులు పట్టుకున్నారు.
అయితే ఆలయ అధికారుల పరిధి లో ఉండే కోడె టికెట్లు అయితే వారి చేతికి ఎలా వచ్చాయి, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది ఎవరైనా సహకరిం చారా అనే కోణంలో ఆలయ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలు స్తున్నది.