calender_icon.png 25 December, 2024 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడాకు రూ.43.75 కోట్లు

19-10-2024 02:40:38 AM

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కడా)కు ప్రభుత్వం రూ.43.75 కోట్ల నిధులను విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కడా ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం కడాకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది.

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కడా ప్రత్యేక అధికారి కొడంగల్ అభివృద్ధి కోసం రూ.120 కోట్లతో అంచనాలను ప్రభుత్వానికి సమర్పించగా ఇప్పటికే రూ.15 కోట్లతో వివిధ పనులు చేపట్టారు. తాజాగా రూ.43.75 కోట్లను విడుదల చేశారు. కడాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం వల్ల కొడంగల్ అభివృద్ధికి అవకాశం ఏర్పడుతోందని స్థానికులు చెబుతున్నారు.