calender_icon.png 3 February, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రారంభమైన కొడకంచి ఆదినారాయణస్వామి బ్రహ్మోత్సవాలు

03-02-2025 12:40:46 AM

పటాన్ చెరు, ఫిబ్రవరి 2 : తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ కంచిగా పేరుగాంచిన కొడకంచి ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామం మొత్తం ఆదినారాయణ స్వామి నామస్మరణ జరుగుతోంది.

ఆదివారం ఆదినారాయణ స్వామిని పురవీధుల్లో పల్లకి సేవలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు దర్శనాల కోసం వివిధ ప్రాంతాలనుంచి భారీగా తరలివస్తున్నారు. దర్శనాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అవసరమైన అన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ ట్రస్టి చైర్మన్ అల్లాణి రామాజీరావు తెలిపారు.