27-03-2025 06:00:18 PM
కోదాడ మాజీ కౌన్సిలర్లు డిమాండ్..
మంత్రి ఉత్తమ్ తో పాటు పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని విన్నపం..
కోదాడ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యేగా ఉంటూ, కోదాడ నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఎనలేని సేవలు చేస్తూ, అసెంబ్లీలో పేదల గొంతుగా గళం విప్పుతూ ప్రతినిత్యం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోదాడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కోరారు.
కోదాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కోదాడ నియోజకవర్గం నుండి మహిళ ఎమ్మెల్యేగా పద్మావతి రెడ్డి ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి విస్తరణలు జరుపుతున్న నేపథ్యంలో కోదాడ ఎమ్మెల్యేకు కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని మాజీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల రమేష్, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు కొల్ల ప్రసన్న కోటిరెడ్డి, పెండెం వెంకటేశ్వర్లు, కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్, రాజు, షఫీ, కర్రీ సుబ్బారావు, షాబుద్దీన్, కైలాస్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.