calender_icon.png 2 February, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడ మొదటి స్థానంలో నిలవడం అభినందనీయం

01-02-2025 09:56:28 PM

కోదాడ (విజయక్రాంతి): తెదేపా కార్యకర్తలు, నాయకుల సమిష్టి కృషితోనే సభ్యత్వ నమోదులో కోదాడ నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని తెదేపా రాష్ట్ర మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వరరావు అన్నారు. శనివారం నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 5193 సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రస్థాయిలో తాను రెండో స్థానంలో నిలవడం కార్యకర్తల కృషితోనే సాధ్యమైందన్నారు. మండల పార్టీ నాయకులు దొడ్డ గురవయ్య, కొల్లు నరసయ్య, భయ్యా నారాయణ, పిట్టల శోభన్ బాబు, కొల్లు గురవయ్య, చాపల శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, ఏటుకూరి సురేష్, కొల్లు సత్యనారాయణ, థామస్, రామ్మోహన్ రావు, హనుమంతరావు, శివ, బాబా, నరేష్ పాల్గొన్నారు.