calender_icon.png 25 November, 2024 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెఓసి రోడ్డు మరమత్తులు చేపట్టాలి

25-11-2024 04:14:55 PM

ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు డి ప్రసాద్

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని టేకులపల్లి మండల కేంద్రం నుంచి కోయగూడెం ఉపరితల గని వరకు సింగరేణి రోడ్డు మరమత్తులు చేపట్టాలని భారత కార్మిక సంఘాల సామాఖ్య (ఐ ఎఫ్ టి యు) రాష్ట్ర నాయకులు డి ప్రసాద్ డిమాండ్ చేశారు. కేఓసి నుంచి ఇల్లందు, నవభారత్, బిపిఎల్, కొత్తగూడెం, ఇతర ప్రాంతాలకు బొగ్గు సరఫరా చేస్తున్న బొగ్గు లారీల వలన తుమ్మల చలక, సామ్య తండా, తుమ్మలచెలక స్టేజి, అంజనేయపాలెం, అందుగుల గూడెం, టేకులపల్లి తదితర గ్రామాలలో రోడ్డు గుంతలు పది అధ్వాన్నంగా తయారైందని తెలిపారు.

సింగరేణి మరమ్మత్తులు చేపట్టకపోవడం మూలాన దుమ్ము, దూళితో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాహనదారులు, పాదాచారులు అనేక అవస్థలు పడుతున్నారని వివరించారు. దుమ్ము ధూళితో దగ్గు, జలుబు, అస్తమా ఇంకా ఇతర రకరకాల వ్యాధులతో మంచాన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య  సమస్యలను సింగరేణి విస్మరిస్తుందని అన్నారు. సింగరేణి యాజమాన్యం వస్తున్న దుమ్ము దూళిని ప్రత్యక్షంగా చూసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. తక్షణమే రోడ్డు మరమత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే రోడ్డు మరమ్మత్తు పనులను చేపట్టకపోతే ఐఎఫ్టియు ఆధ్వర్యంలో రాకపోకలను అడ్డుకుంటామని ఆయన సింగరేణి యాజమాన్యమును హెచ్చరించారు.