calender_icon.png 11 February, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్షల భయం పోగొట్టేందుకు అవగాహన..

11-02-2025 06:29:58 PM

నిర్మల్ (విజయక్రాంతి): పదవ తరగతిలో 100% ఫలితాలను సాధించాలంటే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రణాళిక బద్ధంగా చదివించాలని విద్యాశాఖ కార్యదర్శి సూచించినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా టీ షార్ట్ ద్వారా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని నిర్మల్ పట్టణంలోని మందులాపూర్ ఉన్నత పాఠశాలలో పాల్గొని విన్నారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టులలో అత్యుత్తమ మార్కులు సాధించేలా సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్యులతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరీక్షల సహాయ కమిషనర్ సిద్ధ పద్మ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.