calender_icon.png 23 October, 2024 | 11:22 PM

కేంద్ర బడ్జెట్‌పై నాలెడ్జ్ టెస్ట్

09-08-2024 12:05:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (విజయక్రాంతి): లక్డీకపూల్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల, అలక్డీకపూల్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల, అనలాగ్ ఐఏఎస్ అకాడమీ, అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో గురువారం బడ్జెట్ నాలెడ్జ్ టెస్ట్‌ను నిర్వహించారు. కేంద్రం ప్రవేశపెట్టిన 2024 25 బడ్జెట్‌పై విద్యార్థులందరూ అవగాహన పెంపొందించుకునేలా కార్యక్రమం ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ పరీక్షలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 కళాశా లల నుంచి 400 మంది డిగ్రీ, పీజీ స్థాయి విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కూర రఘువీర్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. మొదటి బహుమతి శ్రీకాంత్ (న్యూ గవర్నమెంట్ స్కూల్, ఖైరతాబాద్) రూ.3,500, రెండో బహుమతి కళ్యాణ్‌రాజ్ (నిజాం కళాశాల) రూ. 2,500, మూడో బహుమతి ప్రాచి గోయల్ (అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్) రూ.1,500 గెలుచుకున్నారు. వీరితో పాటు మొత్తం 8 మంది విద్యార్థులు బహుమతులు అందుకున్నారు.