calender_icon.png 11 February, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన అవసరం

10-02-2025 07:52:22 PM

సంతోష్ సింగ్ చౌహన్..

చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని చెన్నపురం సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్ వారి సహకారంతో భారతి ఫౌండేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జీవనోపాధి కొరకు పుట్ట గొడుగుల పెంపకంపై శిక్షణ తరగతులను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ సింగ్ చౌహాన్ సీనియర్ ఆఫీసర్ పాల్గొని మాట్లాడుతూ... స్వయం జీవనోపాధి పొందడానికి ఈ కార్యక్రమం ద్వారా పుట్ట గోడుగుల పెంపకంపై శిక్షణ తీసుకుని సొంతంగా ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో భారతి ఫౌండేషన్ నిర్వాహకులు నిదనపల్లి ప్రసాద్ మాట్లాడుతూ... పుట్టగొడుగుల పెంపకంపై ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ రెడీమెడ్ గా పెంపకం చేస్తూ లాభాలు పొందుతున్నారని మీరు కూడా మీ గ్రామంలో యువతి యువకులు అందరు పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకోవాలని కోరారు.