వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘనందన్‌రావు
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): ప్రభుత్వం రైతుల కోసం యాం త్రీకరణపై అవగాహన కార్యక్రమాలు చేపడితే ఆశించిన స్థాయిలో వ్యవసాయరంగం లో లాభాలు సాధ్యమని వ్యవసాయశాఖ సె క్రెటరీ రఘనందన్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్‌లో సహకారం, అవకాశాలు అనే అంశంపై ఈక్రిశాట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని, తద్వారా పంట దిగుబడులు పెరుగు తాయన్నారు.
భారతలో యాంత్రీకరణ త క్కువని, వ్యవసాయంలో యంత్రాల ప్రా ధాన్యం మరింత పెరగాలన్నారు. చిన్న కమతాల రైతులకు స్థిరమైన ఆదాయాన్ని వ్యవ స్థలను రూపొందించడంపై దృష్టి సారించాలన్నారు. అనంతరం ఈక్రిశాట్ డైరెక్టర్ స్టా న్‌ఫోర్డ్ బ్లేడ్ ప్రసంగిస్తూ వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్ ఆవిష్కరణల అభివృద్ధి చాలా కీలకమని, తాము సీఐఐ భాగస్వామ్యంతో నూతన వంగడాలను తీసుకొచ్చేందుకు కృషి చే స్తున్నామన్నారు. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ.. వ్యవసాయంరంగంలో నష్టాలను ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తే లక్ష్యాలను చేరుకుంటారన్నారు.