28-04-2025 01:36:32 AM
చేవెళ్ల, ఏప్రిల్ 27: చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ (మోజర్ల) ఆధ్వర్యంలో ఆదివారం ఉద్యాన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫ్లోరికల్చర్ రీసెర్చ్ సెంటర్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డా. జ్యోతి సైంటిస్ట్ - ప్రణీత్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. జే శ్రీనివాస్ , 20 21 బ్యాచ్ విద్యార్థులు స్వాతి, అఖిల, ప్రీతి , లావణ్య, రచన, అఖిల, శారద, సంతోష,
సానియా పంటల సాగుపై ప్రదర్శనలు ఏ ర్పాటు చేశారు. పంటల సమగ్ర సస్య రక్షణ తో పాటు సేంద్రియ వ్యవసాయం, పచ్చి రొట్టె పైర్లు, బహుళ అంచెల పంట సాగు, అంతర పంటలు, కోల్ స్టోరేజ్, పట్టు పురుగుల పెంపకం, బిందు సేద్యం, భూసార పరీక్షల గురించి రైతులకు వివరించారు.