బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, నాగపూర్ జాతీయ పత్తి పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శివ కృష్ణ ఆధ్వర్యంలో యువతకి అవగాహన కల్పించారు. జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం కింద ఉత్తమ పద్ధతుల ద్వారా జిల్లా వ్యాప్తంగా 425 ఎకరాల్లో రైతు క్షేత్రాలను సందర్శించడం జరిగిందన్నారు. గ్రామీణ యువతకి తేనెటీగల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. తేనెటీగలపెంపకంలో పాటించాల్సిన మెలకువలను వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ నాగరాజు, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ శైలజ, డాక్టర్ అనిల్, వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు పాల్గొన్నారు.