- శిశు మరణాలు జరగకుండా చూసుకోండి
శిశు మరణాల సమీక్షా సమావేశం లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్, జనవరి 30 (విజయ క్రాంతి) : గర్భిణీల స్థితిగతులను క్షుణ్ణంగా తెలుసుకుని సమగ్ర నివేదికను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాల యంలో మినీ సమావేశ మందిరం లో శిశు మరణాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహిం చారు. శిశుమరణాలు తగ్గించుటకు స్త్రీ గర్భ వతిగా ఉన్నప్పటి నుండి జాగ్రత్తలు తీసుకో వాలని, మేనరికపు వివాహాలు చేసుకోక పోవటం మంచిదని సూచించారు.
గర్భిణీ స్త్రీ యొక్క స్థితిగతులను అంచనా వేసి నా ణ్యమైన పోషకాహారం అందించాలని, ఆంగన్ వాడి కేంద్రాలను సంప్రదించా లని, గర్భిణీ స్త్రీలను చెకప్ చేసి సరైన సమయా నికి వైద్యం అందించాలని డాక్టర్ లకు సూ చించారు. పుట్టిన పిల్లలకు సరైన సమయం లో టీకాలు ఇప్పించాలని,పాలు పట్టే విధా నం బాలింత తీసుకోవాల్సిన జాగ్రత్తలు,తల్లి బిడ్డల ఆరోగ్యం గురించి అంగన్ వాడీలు, ఆశాలు అవగాహన కలిగించాలని అన్నారు.
అంతకుముందు రెవెన్యూ సమావేశం మందిరం నందు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమీక్షలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా కె.కష్ణ,జిల్లా ఇమ్యూ నైజేషన్ అధికారిణి డా.పద్మజ,జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరంటెం డెంట్ డా.సంపత్ కుమార్,డిప్యూటీ డి.ఎం. హెచ్.ఓ డా శ్రీధర్ రెడ్డి, స్త్రీ వ్యాధుల నిపుణు లు, పి.హెచ్.సి. డాక్టర్‌లు తదితరులు పాల్గొన్నారు.