calender_icon.png 14 February, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధరలను తెలుసుకుని సరుకును తీసుకరావాలి

13-02-2025 11:09:08 PM

వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు రాజశేఖర్‌రెడ్డి...

మలక్‌పేట: రైతులు పండించిన వివిధ సరుకులకు మంచి గిట్టుబాటు ధర లభించేందుకు ముందు రోజు ధరలను అధికారులు, కమీషన్‌దారులను తెలుసుకుని మాత్రమే సరుకును అమ్మకానికి తీసుకరావాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు కె.రాజశేఖర్‌రెడ్డి అన్నారు. వివిధ పంటలు ఒకేసారి మార్కెట్‌ల్లో రావడం వలన ధరల్లో కొంత తగ్గుదల వస్తుండడం, ధరలు స్థిరంగా ఉండేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించి, మానిటర్ చేసేందుకు వివిధ మార్కెట్‌లకు ప్రత్యేక అధికారులు పర్యవేక్షించేందుకు ఆదేశించారు.

ఇందులో భాగంగా గురువారం మలక్‌పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీని సంయుక్త సంచాలకులు రాజశేఖర్‌రెడ్డి సందర్శించి రైతులతో మాట్లాడారు. మార్కెట్ యార్డులో పర్యవేక్షించి రైతులతో ధరల విషయం పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలను చేశారు. ధరల గురించి తెలుసుకుని మార్కెట్‌కు తీసుకోవాలని స్పష్టం చేశారు. మార్కెట్ ఎస్‌జీఎస్ దామోదర్, చిలుక నర్సింహ్మారెడ్డి తదితరులు ఉన్నారు.