calender_icon.png 27 October, 2024 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారిన క్రెడిట్ కార్డ్ రూల్స్ తెలుసుకోండి!

30-06-2024 12:33:10 AM

  • ఎస్బీఐ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, సిటి బ్యాంక్ క్రెడిట్ కార్డులకు కొత్త నిబంధనలు 

జూన్ 1 నుంచి అమల్లోకి

పలు ప్రధాన బ్యాంక్‌లు వాటి ఖాతాదారులకు అందించే క్రెడిట్ కార్డు సర్వీసుల్లో గణనీయమైన మార్పులు చేశాయి. క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లు, ఆ పాయింట్ల ప్రయోజనాలు, వివిధ కాలపరిమితులు తదితరాలను మార్చాయి. జూలై నెల నుంచి అమలులులోకి రానున్న ఈ ప్రధాన మార్పులేమిటో తెలుసుకుందాం!

ఎస్బీఐ కార్డ్ క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్ల నిలిపివేత

కొన్ని క్రెడిట్ కార్డులపై జరిగే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలకు రివార్డు పాయింట్లను ఇవ్వడం  జూలై 15 నుంచి నిలిపివేస్తున్నట్టు ఎస్బీఐ కార్డ్ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. 20కిపైగా ఎస్బీఐ కార్డ్ క్రెడిట్ కార్డులకు ఇది వర్తిస్తుంది. అవి..

  • ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం కార్డ్
  • ఎయిర్ ఇండియా 

ఎస్బీఐ సిగ్నేచర్ కార్డ్

  1. సెంట్రల్ ఎస్బీఐ+సెలక్ట్ కార్డ్
  2. చెన్నై మెట్రో ఎస్బీఐ కార్డ్
  3. క్లబ్ విస్తారా ఎస్బీఐ కార్డ్
  4. ఢిల్లీ మెట్రో ఎస్బీఐ కార్డ్
  5. ఇతిహాద్ గెస్ట్ ఎస్బీఐ కార్డ్
  6. ఇతిహాద్ గెస్ట్ ప్రీమియర్ 

ఎస్బీఐ కార్డ్

  1. ఫ్యాబ్‌ఇండియా ఎస్బీఐ కార్డ్
  2. ఫ్యాబ్‌ఇండియా ఎస్బీఐ కార్డ్ సెలక్ట్
  3. ఐఆర్‌సీటీసీ ఎస్బీఐ కార్డ్
  4. ఐఆర్‌సీటీసీ ఎస్బీఐ కార్డ్ ప్రీమియర్
  5. ముంబై మెట్రో ఎస్బీఐ కార్డ్
  6. నేచుర్స్ బాస్కెట్ ఎస్బీఐ కార్డ్
  7. నేచుర్స్ బాస్కెట్ ఎస్బీఐ కార్డ్ ఎలైట్
  8. ఓఎల్‌ఏ మనీ ఎస్బీఐ కార్డ్
  9. పేటీఎం ఎస్బీఐ కార్డ్
  10. పేటీఎం ఎస్బీఐ కార్డ్ సెలక్ట్
  11. రిలయన్స్ ఎస్బీఐ కార్డ్
  12. రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్
  13. యాత్ర ఎస్బీఐ కార్డ్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల నిబంధనలు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు రెంట్ చెల్లింపులకు సంబంధించి కొన్ని మార్పులు చేసింది. క్రెడ్, చెక్, మొబిక్విక్, ఫ్రీచార్జ్ తదితర ప్లాట్‌ఫామ్స్ ద్వారా జరిపే చెల్లింపులకు కొత్త రేట్లను అమలు చేస్తున్నది. ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారా జరిపే రెంట్ లావాదేవీకి 1 శాతం ఫీజును (లావాదేవీకి రూ.3000 సీలింగ్) కస్టమర్ల నుంచి చార్జ్ చేస్తుంది. ఇది ఆగస్టు 1 నుంచి వర్తిస్తుంది. టాటా న్యు ఇన్ఫినిటీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఆగస్టు 1 నుంచి కస్టమర్లు జరిపే అర్హమైన యూపీఐ లావాదేవీలపై  0.5 శాతం క్యాష్ బ్యాక్‌ను ప్రకటించింది. లావాదేవీకి టాటా న్యు యూపీఐ ఐడీని ఉపయోగిస్తే అదనంగా 1 శాతం న్యు కాయిన్స్ లభిస్తాయని తెలిపింది. 

సిటిబ్యాంక్ క్రెడిట్ కార్డుల మైగ్రేషన్

సిటిబ్యాంక్ క్రెడిట్ కార్డుల్లో చేపట్టిన మార్పులను యాక్సిస్ బ్యాంక్ నోటీఫై చేసింది. సిటిబ్యాంక్ ఇండియా వ్యాపారాన్ని యాక్సిస్ బ్యాంక్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. జూలై 15కల్లా కార్డులతో సహా కార్డ్ రిలేషన్‌షిప్‌ల మైగ్రేషన్ పూర్తవుతుందని సిటిబ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు యాక్సిస్ బ్యాంక్ ఈమెయిల్ నోటిఫికేషన్ ద్వారా తెలియపర్చింది. కొద్ది నెలల్లో (ఈ సంవత్సరాంతానికల్లా) కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డులు పొందేవవరకూ వారి సిటి బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు పనిచేస్తాయన్నది. మైగ్రేషన్ తేదీవరకూ పొందిన పాయింట్లు ఎక్స్‌పైర్ కావని తెలిపింది. అయితే మైగ్రేషన్ పూర్తయిన మూడేండ్లకు ఆ పాయింట్లు ఎక్స్‌పైర్ అవుతాయని పేర్కొంది.

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చార్జీలు

ఐసీఐసీఐ బ్యాంక్ జారీచేసిన పలు క్రెడిట్ కార్డ్ సర్వీసుల నిబం ధనలను సవరించింది. జూలై 1 నుంచి ఈ మార్పులు అమలవుతా యి. అందులో ముఖ్యమైనది అన్ని కార్డులకూ (ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డ్ మినహా)  కార్డ్ రీప్లేస్‌మెంట్ చార్జీని రూ. 100 నుంచి రూ.200కు పెంచింది. కొన్ని సేవల్ని సైతం నిలిపివేస్తున్నట్టు తెలిపింది. మరికొన్ని సేవల్లో మార్పులు చేసింది. అవి..

    1. రూ.100 ఫీజుతో చెక్కు/క్యాష్ పికప్ నిలిపివేత
    2. రూ.100 ఫీజుతో చార్జ్ స్లిప్ రిక్వెస్ట్ సేవలు నిలిపివేత
    3. డ్రాఫ్ట్ వాల్యూ మొత్తంలో కనీసం రూ.300/ 3 శాతం మినహాయింపు లావాదేవీ ఫీజు నిలిపివేత
    4. అవుట్‌స్టేషన్ చెక్కు ప్రాసెసింగ్‌కు సంబంధించి దాని విలువలో 1 శాతం/కనీసం రూ.100 లావాదేవీ నిలిపివేత
    5. రూ.100 ఫీజుతో డూప్లికేట్ స్టేట్‌మెంట్ (మూడు నెలలకు మించి)  జారీ నిలిపివేత