calender_icon.png 2 April, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్‌స్టర్‌డామ్‌లో కత్తి పోట్ల కలకలం.. అనుమానితుడి అరెస్ట్

27-03-2025 11:46:49 PM

అనుమానితుడి ఉద్దేశం తెలియదన్న పోలీసులు..

ఏరియాలో హైఅలర్ట్ ప్రజారవాణా బంద్..

అమ్‌స్టర్‌డామ్: అమ్‌స్టర్ డామ్‌లోని సెంట్రల్ డ్యామ్ స్కేర్ వద్ద జరిగిన కత్తి పోట్ల ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ దాడి వెనుక ఉద్దేశమేంటో ఇంకా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. ‘ఈ దాడి వెనుక ఏ ఉద్దేశముందే మాకు ఇంకా తెలియరాలేదు. దర్యాప్తు కొనసాగుతోంది’ అని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. కత్తిపోట్లు జరిగిన ప్రాంతం టూరిస్ట్ ప్రదేశం. చాలా మంది టూరిస్టులు ఆ ప్రాంతానికి వెళ్తుంటారు. ఈ దాడి ఘటనతో ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రజారవాణాను నిలిపేశారు. ఘటన జరిగిన ప్రాంతానికి హెలికాప్టర్, అంబులెన్సులు చేరుకున్నాయి. ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతంలో కత్తిపోట్ల కలకలం రేగడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.