calender_icon.png 27 April, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుట్టినరోజు వేడుకల్లో కత్తితో హంగామా

26-04-2025 12:00:00 AM

  1. సోషల్ మీడియాలో ప్రచారం 

కేసు నమోదు చేసిన నాగోల్ పోలీసులు

ఎల్బీనగర్, ఏప్రిల్ 25 : ఒక వ్యక్తి తన పుట్టిన రోజు సందర్భం గా పెద్ద కత్తితో కే కును కట్ చేసి ఇన్‌స్టా గ్రామ్‌లో ఇతరులను భయబ్రాంతులకు గురి చేసే వి ధంగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేశా డు. సమాచారం తెలుసుకున్న నాగోల్ పో లీసులు అతడి అడ్రస్ కనుక్కొని, అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నాడని అరె స్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరా లు..

నాగోల్ పరిధిలోని ఆనంద్ నగ ర్ కృషి నగర్ కాలనీలో నివాసముంటున్న రాసునూరి అఖిల్(24) కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్లో పెద్ద కత్తితో కేకును క ట్ చేసి, భయబ్రాంతులకు గురిచేసే ఫొ టోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.

సమాచారం తెలుసుకున్న నాగోల్ పోలీసు లు అతడి ఇంటిలో సోదా చేయగా, పొ డవైన కత్తి లభించింది.  అక్రమ ఆయుధాలు కలిగిన ఉన్నాడని పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించినట్లు సీఐ సూర్యానాయక్ తెలిపారు.