calender_icon.png 15 November, 2024 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాహితపై కన్నేసి.. ఆమె భర్తను చంపి!

15-11-2024 12:32:06 AM

  • తాపీ మేస్త్రీ దారుణ హత్య
  • ఎల్లారెడ్డిగూడెంలో ఉన్మాది ఘాతుకం

జనగామ, నవంబర్ 14 (విజయక్రాంతి)/రఘునాథపల్లి: ఇంటి వద్ద తాపీ పనిచేసిన మహిళపై కన్నేసిన ఓ కామాంధుడు చివరికి ఆమె భర్తను హతమార్చాడు. ఆపదలో అప్పు తీసుకున్నందుకు భార్యాభర్తలను తీవ్రంగా వేధించి ఒకరి ప్రాణాన్ని బలిగొన్నాడు. జనగామ జిల్లా రఘునాథపల్లి మం డలం ఎల్లారెడ్డిగూడెంలో దారుణ హత్య జరిగింది. ఎల్లారెడ్డిగూడేనికి చెందిన గంపల పరశురాములు (40), సంధ్య దంపతులు. తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు తమ గ్రామంలోనే రెండేళ్ల క్రితం పర్వత మహేందర్ ఇంటి నిర్మాణ పనులు చేశారు.

మహేందర్ భార్య కొన్నేళ్ల క్రితమే విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. ఒంటరిగా ఉంటున్న మహేందర్ కన్ను తన ఇంటి వద్ద తాపీ పనిచేస్తున్న సంధ్యపై పడిం ది.ఇంటి పనులు చేస్తున్న క్రమంలోనే సంధ్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో మహేందర్ వద్ద రూ.80 వేల అప్పు తీసుకున్నారు. ఈ డబ్బులు తిరిగి ఇచ్చే క్రమంలో పరశురాములు, మహేందర్ మధ్య కొన్నిసార్లు గొడవలు కూడా జరిగాయి.

అప్పు సాకుతో సంధ్యతో మహేందర్ అసభ్యంగా మాట్లాడేవాడని తెలిసింది. కూలీ పనులు చేసి అప్పు తీర్చినప్పటికీ మహేందర్ వేధింపులు ఆపలేదని సంధ్య చెబుతోంది. ఈ క్రమంలో బుధవారం గ్రామంలోని ఓ పెళ్లి వేడుకలో పరశురాములు పాల్గొన్నా డు. అర్ధరాత్రి 12.30 గంటల వరకు భరాత్ లో డ్యాన్స్ కూడా వేశాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లాడు. బాగా మద్యం తాగి ఉన్న పరశురాములుకు మహేందర్ ఫోన్ చేశాడు.

ఫోన్‌లో ఇద్దరికి డబ్బుల విషయంలో మాటామాటా పెరిగింది. దీంతో ఆవేశంతో నీ అంతు చూస్తా నంటూ పరశురాములు మహేందర్ ఇంటికి వెళ్లాడు. ఆయన వెంట భార్య సంధ్య కూడా వెళ్లింది. అప్పటికే కత్తితో సిద్ధంగా ఉన్న మహేందర్ తన ఇంటి ముందుకు పరశురాములు రాగానే ఒక్కసారిగా దాడి చేశాడు.

విచక్షణా రహితంగా కత్తితో నరకడంతో పరశురాములు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పో యాడు. అనంతరం రఘునాథపల్లి పోలీస్ స్టేషన్‌లో మహేందర్ లొంగిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.