మారథన్‌లో పాల్గొన్న జమ్మూ సీఎం ఒమర్
శ్రీనగర్, అక్టోబర్ 20: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఆదివారం జరిగిన మారథన్‌ను సీఎం ఒమర్ అబ్దుల్లా జెండా ఊపి ప్రారంభించారు. ఆయన రన్నింగ్‌లో పాల్గొని రెండు గంటల్లోనే 21 కిలోమీటర్లు పరిగెత్తారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. 13 దేశాలకు చెందిన 2 వేల మంది అథ్లెట్లు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. మారథాన్‌లో హుషారుగా పాల్గొన్న అబ్దుల్లా అందరి దృష్టిని ఆకర్షించారు.
‘నా జీవితంలో 13 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఎప్పుడూ పరిగెత్తలేదు. అది కూడా ఒక్కసారి మాత్రమే. ఈ రోజు చాలామంది మారథాన్‌లో పాల్గొనడంతో వారితో కలిసి ఉత్సాహంగా ముందుకు సాగా’ అని ఒమర్ అబ్దుల్లా అని పేర్కొన్నారు. కాగా కాశ్మీర్ లోయలో జరిగిన తొలి అంతర్జాతీయ ఈవెంట్ ఇదే.