calender_icon.png 23 April, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేఎల్‌ఆర్ వేసవి ఫుట్‌బాల్ శిక్షణా తరగతులు

23-04-2025 12:39:15 AM

పెబ్బేరు ఎప్రిల్ 22: ఎంతో మంది విద్యార్థులను ఫుట్బాల్ జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిన   కేఎల్‌ఆర్ వేసవి శిక్షణా శిబిరం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఫుట్ బాల్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి కారెడ్డి క్రిష్ణ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ నెల 24,గురువారం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు.

విద్యార్థులు వేసవి కాలం సెలవులు రావడంతో విపరీతంగా స్వేచ్ఛ కు లోనవుతారని అన్నారు. సమయాన్ని వృథా చేస్తూ చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉంది. విద్యార్థుల మానసిక వికాసం కోసం, శారీరక ధారుఢ్యం కోసం, క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర స్థాయి శిక్షకులచే ఫుట్బాల్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కేఎల్‌ఆర్ స్పోరట్స్ క్లబ్ నిర్వాహకులు యండి అప్సర్ తదితరులు పాల్గొన్నారు.