11-04-2025 01:27:18 AM
బెంగళూరు, ఏప్రిల్ 10: ఐపీఎల్ 18వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వరు స విజయాలతో జోరు ప్రదర్శిస్తోం ది. గురువారం చిన్నస్వామి స్టేడి యం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో రా యల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. ఢిల్లీకి ఇది వరుసగా నాలుగో విజయం కావ డం విశేషం.
తొలుత బ్యాటింగ్ చేసి న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (37 నాటౌట్), ఫిల్ సాల్ట్ (37) పర్వాలేదనిపించడంతో ఆర్సీబీ గౌరవప్రద మైన స్కోరు చేసింది. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్ (93 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో మెరవగా.. స్టబ్స్ (38 నాటౌట్) సహకరించాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ 2 వికెట్లు తీశాడు. నేడు జరగనున్న మ్యాచ్‌లో చెన్నైతో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది.